గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి.CITU

May 13, 2025 - 19:09
 0  7
గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి.CITU
గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి.CITU

జోగులాంబ గద్వాల 13 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ కొరకు మే 20న జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ పిలుపునిచ్చారు మంగళవారం శనగొని పల్లి కొత్తపల్లి గుంటిపల్లి గ్రామాలలో ఉపాధి కూలీలను కలిసి సమ్మె ప్రచారాన్ని నిర్వహించారు  


    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలసలను నివారించి స్థానికంగానే ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వామపక్షాలు చేసిన పోరాటాల ఫలితంగా నాటి ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకవచ్చిందని  అన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంపై వ్యవహరిస్తున్న  విధానాల వల్ల వలసలు  పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదన్నారు  దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణకు ఉపాధి కూలీలు గ్రామీణ బంద్ కు పిలుపునిచ్చారని తెలిపారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా  అమలు చేయాలంటే ఏడాదికి రెండున్నర లక్షల కోట్లు అవసరమని కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కేవలం 86 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ఉద్దేశపూర్వకంగా బడ్జెట్లో తక్కువ నిధులు  కేటాయించిందని విమర్శించారు ఉపాధి హామీకి బడ్జెట్లో నిధుల కేటాయింపులలో కోత విధించడం వల్ల తక్కువ పని దినాలు అమలు చేయడం పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉండటం సంవత్సరాల తరబడి కూలీలు పెండింగ్ లో ఉండటం కొత్త జాబ్ కార్డులు ఇవ్వకుండా ఉండటం ప్రయాణ మరియు కరువు బత్యం చెల్లించకపోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన 300  రూపాయల కూలీ కూడా అమలు కావడం  లేదని కేవలం 150 నుండి 200 మాత్రమే కూలీల ఖాతాలలో జమ అవుతున్నదని అన్నారు బడ్జెట్లో ఉపాధి హామీకి అధిక నిధులు కేటాయించాలని ప్రతి కుటుంబానికి 200 పని దినాలు కల్పించాలని కూలీలకు కనీస కూలి 600 ఇవ్వాలని తదితర డిమాండ్లతో మే 20న జరిగే గ్రామీణ బంద్ లో ఉపాధి కూలీలు పని బంద్ చేసి సమ్మెలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయాలని కోరారు  ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు కళ్యాణ్ నరేష్ రంగన్న మరియమ్మ సువార్త వంశీ శాకీర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333