పొలంలోకి దూసుకెళ్లిన కారు....తప్పిన పెను ప్రమాదం

Jul 19, 2026 - 19:54
Jul 19, 2026 - 20:44
 0  701
పొలంలోకి దూసుకెళ్లిన కారు....తప్పిన పెను ప్రమాదం

  తిరుమలగిరి 20 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం తొండ గ్రామ శివారులోని కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. వివరాలకు వెళ్తే చిత్తలూరు గ్రామానికి చెందిన గిరిగాని రాజు తండ్రి విజయ్ కుమార్ వయసు 36 సాఫ్ట్వేర్ ఇంజనీర్ తిరుమలగిరి నుండి నరసింగంపురం వెళ్తున్న క్రమంలో మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతో తొండ గ్రామ శివారులోని పంట పొలంలోకి దూసుకెళ్లింది గమనించిన స్థానికులు బయటకు తీశారు ఎవరికి ఏమి జరగపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో సూర్యాపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించారు ప్రమాద సమయంలో కారులో డ్రైవర్‌ ఒక్కడే ఉన్నట్లు తెలిసింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి