బాలికకు అండగా నిలబడిన ఎస్సై వెంకట్ రెడ్డి

Jul 19, 2026 - 14:39
Jul 19, 2026 - 17:29
 0  675
బాలికకు అండగా నిలబడిన ఎస్సై వెంకట్ రెడ్డి

సలాం పోలీస్.. 

పోలీస్ స్టేషన్ లో వచ్చే ఫిర్యాదులకు మంచి స్పందన...

బాధితులకు భరోసనిస్తూ అండగా నిలబడుతున్న ఎస్సై.. 

తల్లిదండ్రుల ఘర్షణ మానసికంగా ఇబ్బంది పడుతున్న బాలిక.. 

బాలికకు నిత్య అవసరాల సరుకులు అందజేత.. .

బాలిక కళ్ళల్లో ఆనందం.. 

భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించాలి. 

తిరుమలగిరి 19 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలోని సిద్ధి సముద్రం తండాకు చెందిన వృద్ధ దంపతులను వారి కొడుకులు పోషించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వచ్చిన ఆ వృద్ధ దంపతులను ఆప్యాయంగా పలకరించిన ఎస్ఐ వెంకటరెడ్డి వారి యోగక్షేమలు అడిగి తెలుసుకున్న తదనంతరం వారి సమస్యకు పరిష్కరించి ఆ వృద్ధ దంపతుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూసిన విషయం మరవక ముందే మండలంలో నేడు మరో బాలికకు అండగా ఉండి హాస్టల్లో చేర్పించిన ఎస్సై వెంకట్ రెడ్డి వివరాలకు వెళితే మండల కేంద్రంలోని మామిడాల గ్రామానికి చెందిన కావ్య కు మిర్యాలగూడ రాంనగర్ కు చెందిన నాగరాజు కు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఒక కుమార్తె సహస్ర 17 కలదు వృత్తిరీత్యా కటింగ్ చేసేవాడు సాగుతున్న కాలంలోనే భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగడంతో 2024 సంవత్సరంలో కావ్య తన కూతురిని భర్తను వదిలేసి తన తల్లి గారైన మామిడాల గ్రామానికి రావడం జరిగింది.

గత వారం రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో భర్త పై ఫిర్యాదు చేయడంతో ఎస్సై వెంకట్ రెడ్డి వెంటనే స్పందించి మిర్యాలగూడకు కానిస్టేబుల్ నూ పంపించి భర్తను మరియు కూతుర్ని తీసుకురావడం జరిగింది ఇరువురిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది కూతుర్ని తల్లితో వారం రోజులపాటు ఉండమని చెప్పారు దీంతో ఆ కూతురు తల్లితో వెళ్లిన వారం రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కు తల్లితో కూతురుుు వచ్చిన తర్వాత ఎస్సైతో ఆప్యాయంగా మాట్లాడుతూ నా తల్లితో ఉండలేను తండ్రి దగ్గర ఉండలేను ఇద్దరి మధ్య నేను మానసికంగా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నానని 2024 లోనే 10వ తరగతి పూర్తి చేశాను అని ఎస్ఐ వెంకట్ రెడ్డి కి చెప్పడంతో బాలిక భవిష్యత్తు ఆగం కాకూడదనే ఉద్దేశంతో వెంటనే తిరుమలగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఆ బాలికను చేర్పించి పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ యూనిఫామ్ ఆమెకు కావలసిన నిత్యవసర వస్తువులను అందించి ఆ బాలికకు తల్లి తండ్రి లాగా అన్ని తానే తీసుకున్నాడు దీంతో ఎస్సై వెంకటరెడ్డిని మండల కేంద్రంలోని పలువురు ప్రశంసల వర్షం కురిపించారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి