అక్రమ రేషన్ బియ్యంపై పోలీసుల ఉక్కుపాదం.. 6 క్వింటాళ్లు స్వాధీనం

Sep 4, 2026 - 22:07
Sep 4, 2026 - 22:24
 0  1
అక్రమ రేషన్ బియ్యంపై పోలీసుల ఉక్కుపాదం.. 6 క్వింటాళ్లు స్వాధీనం

జోగులాంబ గద్వాల 4 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని మల్దకల్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఉలిగేపల్లి గ్రామానికి చెందిన యెరుకలి పరుశురాముడు (తండ్రి: అంజనేయులు)పై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి, అధిక ధరకు విక్రయించేందుకు పరుశురాముడు తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 5:50 గంటల సమయంలో బ్లూకోల్ట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు తిప్పారెడ్డి (PC-1037), సుధాకర్ (PC-833) ఇంటిని తనిఖీ చేయగా 14 సంచుల్లో నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తించారు. దీంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మల్దకల్ పోలీసులు తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టవిరుద్ధమని పోలీసులు హెచ్చరించారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State