మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేత 

Mar 26, 2025 - 21:24
Mar 26, 2025 - 21:25
 0  64
మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు అందజేత 

 మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ 

అడ్డగూడూరు 26 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిదిలోని లక్ష్మిదేవికాలువ గ్రామానికి చెందిన పార్రేపాటి వెంకటేష్ గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించాడు. భారత రాష్ట్ర సమితి పార్టీ యొక్క క్రియాశీలక సభ్యత్వం పొందినటువంటి కార్యకర్త కావడంతో వెంటనే స్పందించిన తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ మృతి చెందిన కార్యకర్తకు సంబంధించిన ఎఫ్ ఐ ఆర్ కాపీలు మరియు పోస్టుమార్టం రిపోర్టులను భారత రాష్ట్ర సమితి పార్టీ ఇన్సూరెన్స్ విభాగానికి పంపడం జరిగింది. దీని తో మృతి చెందిన కార్యకర్త కి భారత రాష్ట్ర సమితి పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు 2,00,000/-(రెండు లక్షల రూపాయల)చెక్కును అందజేశారు.ఇట్టి అడ్డగూడూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి మాజీ పిఎసిఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు మరియు టిఆర్ఎస్ విద్యార్థి యువ నాయకులు బాలెన్ల అరవింద్ పార్టీ నాయకులు పాశం విష్ణు నరేష్ తదితరులు పాల్గొన్నారు.