టియుడబ్ల్యూజే 143 మండల అధ్యక్షులుగా మంటిపల్లి సతీష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక!

Mar 26, 2025 - 21:20
Mar 26, 2025 - 21:22
 0  56
టియుడబ్ల్యూజే 143 మండల అధ్యక్షులుగా మంటిపల్లి సతీష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక!

అడ్డగూడూరు 26 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- 
అడ్డగూడూరు మండల కేంద్రంలో టియుడబ్ల్యూజే 143 మండల కమిటీని బుధవారం రోజు ఎన్నుకోవడం జరిగింది.ఈ కమిటీకి అధ్యక్షులుగా వెల్డేవి గ్రామానికి చెందిన మంటిపల్లి సతీష్ యాదవ్ ను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా నిర్మాల  వెంకటేశ్వర్లు,గౌరవ అధ్యక్షులు కడియం నాగయ్య,బాలెంల విద్యాసాగర్,ఉపాధ్యక్షులు చిత్తలూరి సుధాకర్ గౌడ్, కార్యదర్శి మార్త రమేష్, సహాయ కార్యదర్శి పేకాటపల్లి శివకుమార్, సంయుక్త కార్యదర్శి చింత సుధాకర్, కార్యవర్గ సభ్యులు,చిన్నం వెంకన్న,పనుమటి సైదులు, మందుల నర్సయ్య,నిర్మాల సందీప్,బాలెంల పరుశురాములు,బాలెంల కళ్యాణి దుర్గయ్యనియమితులయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ తనను మండల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు  కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రానున్న రోజుల్లో జర్నలిస్టులకు, మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజా సమస్యలపై జర్నలిస్టు సమస్యలపై తన వంతు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.