అడ్డగూడూరులో వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి
అడ్డగూడూరు 26 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో బుధవారం రోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం వ్యవసాయశాఖ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. అడ్డగూడూరు మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సభ్యులందరి ఆధ్వర్యంలో అర్ధవార్షిక పరిపాలన నివేదికను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు 540 మందికి నాలుగు కోట్ల 42 లక్షల 37వేల 725 రూపాయలు అయినట్లుగా తెలియజేశారు, నూతన రుణమాఫీలను 150 మంది సభ్యులకు గాను ఒక కోటి 19,22,500 రూపాయలను అందించినట్లు తెలియజేశారు.అదేవిధంగా సహకార సంఘంలో నూతన సభ్యత్వలను అందిస్తున్నా మని, ఇట్టి అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల రైతులు వినియోగించుకోవాలని అదేవిధంగా ఎల్ టి లోను పొందిన రైతులు క్రాప్ లోనుగా మార్చుకునే వెసులుబాటును కల్పించినట్లుగాను తెలియజేశారు, సబ్సిడీలతో వ్యవసాయ పరికరాల పనిముట్లను అందిస్తున్నట్లుగా తెలియజేశారు. నూతన రుణాలను కూడా ఇస్తున్నట్లుగా తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో అడ్డగూడూరు మండల పిఎసిఎస్ ఉపాధ్యక్షుడు చేడ చంద్రయ్య, టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మలగోటి జ్యోజి, మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి డైరెక్టర్లు విద్యాసాగర్, సోమయ్య, అడ్డగూడూరు మండలం పిఎసి ఎస్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,బాలెంల సైదులు,వివిధ గ్రామాల రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.