తుంగతుర్తి లో నాయకులతో కాని పని అధికారులు చేసి చూపించారు

Sep 8, 2024 - 22:06
Sep 8, 2024 - 22:07
 0  3
తుంగతుర్తి లో నాయకులతో కాని పని అధికారులు చేసి చూపించారు
తుంగతుర్తి లో నాయకులతో కాని పని అధికారులు చేసి చూపించారు

తుంగతుర్తి సెప్టెంబర్ 8 తెలంగాణవార్త ప్రతినిధి:- తుంగతుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి ఆనుకొని ఉన్న సీసీ రోడ్డు సరిగా లేక మురికి కాలువ లేక నీరు నిలిచి గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ వార్డులోని సిసి రోడ్డు అటు ఇటు ఎత్తుగా ఉండడం మధ్యలో వంపుగా ఉండడంతో నీళ్లు నిలిచి భారీగా వరద నీరు ఎటుపోకపోవడం తో వీధి ప్రజలు నాలుగు సంవత్సరాల నుండి మొరపెట్టుకున్నప్పటికీ ఈ గ్రామంలో 14 వార్డులు ఉన్నప్పటికీ కొన్ని వార్డులకే పరిమితంగా గ్రామపంచాయతీ నిధులను వెచ్చించి వృధాగా ఖర్చుపెట్టిన ఏ వార్డు సభ్యుడు గ్రామ పెద్దలు ప్రతిపక్ష పార్టీలు కూడా అడగలేని స్థితిలో ఈ గ్రామము నిలిచింది ఉదాహరణకు ఈ వార్డు లో మురికి నీరు వర్షపు నీరు బయటికి వెళ్లే పరిస్థితి లేక ఈ సీసీ రోడ్డు మీదనే మురికి నీరు చేరడంతో ఈ వార్డు సభ్యులు ప్రజలు ఈ మురికి కోపం నుండే నడవ వలసింది లేదా పక్క వీధి నుండి పోవాల్సిందే ఇలాంటి తరుణంలో ఎన్నోసార్లు  దినపత్రికలో రావడంతో దానికి స్పందనగా రెండు మూడు రోజుల నుండి ఈ వార్డుకు రాతి పొడి తో సహకాంకరణ పరిశి నీరు నిలవకుండా ఓకే పక్కకు వెళ్లేటట్టు చేయడంతో నీరు ఎక్కువగా నిలవడం లేదు ఇంకా ఈ వీధికి సీసీ రోడ్డు ఎత్తుగా చేసే పనులు ఉన్నాయి గత ఎనిమిది నెలల నుండి సర్పంచులు లేక నిధులను వెచ్చించలేక గ్రామ ప్రజల గగ్గోలుకు మండల అధికారులు దిగి రావడం కొంత గ్రామ పంచాయతీ నిధులను వెచ్చించి ప్రస్తుత బాటను వేశారు మా పత్రికలో వచ్చిన వార్తకు స్పందనగా గ్రామపంచాయతీ మండల అధికారులు స్పందించి కొద్ది పెట్టుబడి తో మరమ్మతులు చేపట్టారు వార్డు సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు ఏది ఏమైనాపటికి ఈ గ్రామానికి అధిక నిధులు వచ్చినప్పటికీ గ్రామపంచాయతీ సభ్యులు గానీ వాడు సభ్యులు గానీ గ్రామ సర్పంచ్ గాని పట్టించుకోకపోవడంతో నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న వార్డు సభ్యులు తక్షణమే ఇప్పటికైనా మా వార్డును బాగు చేయాలని మండల అధికారులను జిల్లా అధికారులను కోరనైనది మా గ్రామ పంచాయతీ అపరిశుభ్రంగా ఉండడంతో దోమలు భారీగా గ్రామ ప్రజలను కుట్టడంతో అనేక వ్యాధులతో జరాలతో రోగాల బారిన పడుతున్నామని ఎన్నోసార్లు మండల అధికారులకు తెలియపరిచినప్పటికీ గ్రామపంచాయతీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని తక్షణమే వారిపై చర్యలు తీసుకొని గ్రామపంచాయతీలో వీధులను పరిసరాల పరిశుభ్రతను పాటించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు ఈ గ్రామంలో ఇంకా అనేక సమస్యలు కొట్టుమిట్టాడు  తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు తుంగతుర్తి మండలం నియోజకవర్గంలోనే చాలా పెద్ద గ్రామంగా 5000 జనాభాకు ఎక్కువగా ఉన్న గ్రామపంచాయతీకి నిధులు ఎక్కువగా వచ్చినప్పటికీ వాటిని గత పాలకులు దుర్వినియోగం చేశారని మా గ్రామ ప్రజలుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మా గ్రామాన్ని బాగు చేయాలని కోరుతున్నారు..

Abbagani Venu Thungathurthy Mandal Reporter Suryapet District Telangana State.