తెలంగాణ రాష్ట్ర ప్రజలకు  ఉగాది శుభాకాంక్షలు 

జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతoగి  వీరస్వామి గౌడ్. 

Apr 8, 2024 - 18:02
 0  1
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు  ఉగాది శుభాకాంక్షలు 

సూర్యాపేట టౌన్ ఏప్రిల్ 09:- నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ  సుఖసంతోషాలతో ఉండాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీర స్వామి గౌడ్ అన్నారు.  సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో ఒక ప్రకటనలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర  ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజల బాధలు అన్ని తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు కలయిక తో తయారు చేసే ఉగాది పచ్చడి ఉగాది పండుగ ప్రత్యేకత అన్నారు. ఉగాది పచ్చడిలో తొలి అంశం మధురం (తీపి). తీపికి ప్రతీకగా ఉగాది పచ్చడిలో కొత్త బెల్లాన్ని కలుపుతారు

 తీపి ఆనందానికి గుర్తు మనకు ఆనందం కలిగినప్పుడు (పరీక్షలో విజయం సాధించినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు...) మిఠాయిలు  పంచుతాం అంటే ఒక వ్యక్తి తీపి పంచుతున్నాడు అంటే అతనికి ఆనందం కలుగునట్లు సంకేతం మన ఉద్యోగ, వ్యాపారము, వ్యవసాయం, ఇలా ఏ పని చేసినా అంతిమంగా ఆశించేది ఆనందమైన జీవితమే మనిషి జీవితానికి పరమార్థం అందుకనే ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలని పెద్దలు చెబుతుంటారు అటువంటి ఆనందమయ జీవితం ఈ ఏడాదంతా కావాలని సాంకేత రూపంలో చెప్పేదే ఉగాది పచ్చడి లోని మధుర  పదార్థం  మరో కోణంలో కామానికి సాంకేతం కామం అంటే కోరిక. మనిషికి కోరిక ఉంటేనే చేతన్యంగా ఉంటాడు. అంతమాత్రాన కోరిక అద్దు  మీరా కూడదు. అందుకనే ఉగాది పచ్చడిలో సగభాగం మాత్రమే తీపి కలపాలని నియమం పెట్టారు. వైద్య పరంగా కొత్త బెల్లం (తీపి) శరీరంలో ఉండే వాత పిత్త ధర్మాలను అదుపులో ఉంచుతుంది. దప్పిక మూర్ఛలను తొలగిస్తుంది. మంటలనుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది.

 రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కావున పురాణాల చరిత్ర ప్రకారం తెలంగాణ  ప్రజలందరూ కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజున కొత్త పనులు మొదలు పెడుతుంటారు. బంగారం, కొత్త వాహనాలు, కొత్త వస్తువులు, కొత్త ఇల్లు, లాంటివి కొంటారు. కొత్త వ్యాపారానికి కూడా శుభ తరుణంగా భావిస్తారు. ఉగాది పండుగ రోజున పులిహోర, పాయసం, బొబ్బట్లు అనేవి ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ కొత్త మామిడికాయలు వేప పువ్వు బెల్లం, కారం, ఇలా షడ్రుసులతో కూడిన ఉగాది పచ్చడి నీ పండగ వేలు తయారు చేస్తారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది వేడుకల్లో సాంప్రదాయబద్దంగా నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు దీంతో ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333