పార్టీలు మారుడు తప్ప
అభివృద్ధి మీద వీళ్లకు ధ్యాసేది..?
- గద్వాల అభివృద్ధిపై బీజేపీ నిరసన ర్యాలీలో ఎంపీ డీకే.అరుణ సెటైర్లు.
- పదేళ్లలో నేతలు బాగుపడ్డారు తప్పితే.. నడిగడ్డ అభివృద్ధి కోసం ఆలోచించలేదు.
- అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంది.
- గద్వాల జిల్లాలోని ప్రజా సమస్యలపై బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ.
జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : - గద్వాల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణమ్మ , రాష్ట్ర అధికార ప్రతినిధి, గద్వాల జిల్లా ఎన్నికల ఇఛార్జ్ వీరేంద్ర గౌడ్,బిజెపి యువ నాయకురాలు స్నిగ్దా రెడ్డి, జిల్లా అధ్యక్షులు రామాంజనేయలు పార్టీ జిల్లా ముఖ్య నాయకులు.
* పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ 400లకు పైగా బైక్ లతో ర్యాలీ
- పెద్ద సంఖ్యలో వందలాదిగా పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు
- జై బీజేపీ, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం నినాదాలతో మర్మోగిన గద్వాల టౌన్
- కలెక్టర్ కార్యాలయం ముందు బైటయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదలు
- జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ BM. సంతోష్ కి 20 ప్రధాన ప్రజా సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేసిన ఎంపీ డీకే. అరుణ, జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు
ర్యాలీ సాగిందిలా..
- జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్, పాతబస్టాండ్, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, రైల్వే బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ
కామెంట్స్
ద్యాసంతా దోచుదుమీదనే
- ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కండువాల మీదున్న శ్రద్ద.. అభివృద్ధి మీద లేదు
- ఆయన ఎప్పుడు ఎ పార్టీలో ఉంటాదో ఎవరికీ తెలియదు
- అభివృద్ధి కోసమట కాంగ్రెస్ లో చేరడట
- మరీ గతంలో అధికార పార్టీలో ఉంది ఏం చేసాడో చెప్పాలి
- అధికారం ఎ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఆయానుండాలా..? అందుకే ఇప్పటికి జనాలకు తెలియడం లేదు
- ఒకసారి brs అంటాడు.. ఇంకోసారి కాంగ్రెస్ అంటాడు.. ఇప్పుడు ఎటు గాకుండా మధ్యలో ఊగిసలాడుతున్నాడు
- ఇక్కడ గెలిచి కాంగ్రెస్, brs నేతలు బాగుపడ్డారు తప్పితే నడిగడ్డ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు
ఏది అభివృద్ధి..?
- తుమ్మిళ్ల, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల, RDS ప్రాజెక్ట్స్ ఇంకా ఎందుకు పూర్తి చేయలేదు
- ర్యాలంపాడు, జూరాల ప్రాజెక్ట్స్ లేకేజీల సమస్య ఎందుకు సరి చేయలేదు
- ఉమ్మడి గద్వాల జిల్లాలో నేను ఎమ్మెల్యే ఉన్నపుడు వేసిన రోడ్లు తప్పితే మీరెక్కడ రోడ్లు వేశారు
- పిల్లిగుండ్ల కాలనీలో నేటి తాగు నీరు ఇవ్వలేని దౌర్భాగ్యంలో ఇక్కడ పాలకులు ఉన్నారు
- జూరాలకు అప్రోచ్ బ్రిడ్జి కోసం నేను మంత్రిగా ఉండగా ప్రపోజ్ చేసినా నేటికీ కట్టలేదు.. రీసెంట్ గా ఎదో ప్రకటన చేసినట్లున్నారు సంతోషం
- ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోనే a అప్రోచ్ బ్రిడ్జి పూర్తి చేయించాలి.
- పాలమూరు ఎత్తిపోతల అప్రోచ్ జూరాలనుంచే తీసుకోవాలి.. ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు
- వ్యవసాయ కాలువల్లో తట్టేడు మాతయి తీయలేదు
- కళావలన్నీ మీటవేసిన పట్టించుకు నాధుడే లేదు
- గద్వాల రోడ్డు గతుకుల మాయం అయినా ఈ నేతలకు పట్టదా..?
దృష్టి అంతా దోచుడి మీదనే
- ఎక్కడ మనకు మిగులితాయి అన్న యావలో ఒక్కడి నేతలు వ్యవహారిస్తున్నారు
- ఇచ్చిన హామీలు మరిచిపోయి నేను చేసిన పనులను కూడా వారే చేసాము అన్నట్లు బిల్డిప్ ఇస్తున్నారు
- కొంచమైనా సిగ్గుండాలి కదా.
అందుకే ర్యాలీ
- ప్రశ్నించే టోళ్లు లేకనే ఇక్కడున్న నేతలు ఇలా తయారవుతున్నారు
- బీజేపీ ఆధ్వర్యంలో ఇకపై ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం
- రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ జిల్లాలోని ప్రజా సమస్యలపై ఈ నిరసన ర్యాలీ చేపట్టాం
- ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
కోర్టుకు నిర్మాణంలో రాజకీయమా..?
- గద్వాల పట్టాణంలో ఉండాల్సిన కోర్టును రియల్టర్ల కోసం వేరే చోటికి మారుస్తారా
- కోర్టు అనంతపురం రోడ్డుకు మారిస్తే వాళ్ళ భూముల రేట్లు పెరుగుతాయంట
- సిద్ధాంతి కుంట లో ప్రభుత్వ భూమి ఉంటే.. లేదని లిటిగేషన్, టెక్నీకల్ సాకులతో రాజకీయం చేస్తున్నారు
- లాయర్లను మనోభావాలు గౌరవించాలి పాతగా కోర్టు ఉన్న చోటే కొత్త కోర్టు భవనం నిర్మించి ఇవ్వాలి..
- స్థానికుల ప్రజలకు కోర్టు అదుబాటులోనుండేలా చూడాలి.
- ఎక్కడో అడవుల్లో ఉంటే బాధితులు ఇబ్బందులు పడతారు.
కాంగ్రెస్ కు సంస్కారానికి నిదర్శనం
- కాంగ్రెస్ ఈ దేశంలో నీతి మాలిన రాజకీయాలు చేస్తోంది
- ఇప్పటికే విదేశాలకు వెలికి రాహుళ గాంధీ ఈదేశాన్ని, ప్రధాని మోడీని తక్కువ చేసి మాట్లాడుతారు
- ఇప్పుడు ఇంకాస్త దిగజారి ప్రధాని మోదీ గారి తల్లి గురించి తప్పుడు కూతలు కూయడం సిగ్గు చేటు
- ప్రదాని మోదీ గారి తల్లి (మాతృ మూర్తి) గురించి రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని మహిళల అందరి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం