సావిత్రిబాయి పూలే కు పూలమాల వేసిన ఎల్ లేని సుధాకర్ రావు

తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:- చిన్నంబావి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షులు కొల్లాపూర్ నియోజక వర్గ ఇన్చార్జ్ ఎల్ లేని సుధాకర్ రావు చిన్నంబావి మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే కు పూలమాల వెయ్యడం జరిగింది. ఎల్ లేని సుధాకర్ రావు మాట్లాడుతూ విద్యకోసం అహర్నిషలు కృషి చేసిన చైతన్యమూర్తి. స్త్రీ సాధికారిత కోసం శ్రమించిన మహోన్నతమూర్తి సావిత్రిబాయిపూలే గారి జయంతి సందర్భంగా చిన్నంబావి,మరియు వీ పణగండ్ల మండల కేంద్రములో నెలకొల్పిన వారి విగ్రహాలకు నివాళులు అర్పించి,వారి పాదాలకు నమస్కరించారు. వారితోపాటు బిజెపి సీనియర్ నేత కొత్త వెంకట్రెడ్డి, జగ్గారి శ్రీధర్ రెడ్డి, గోపాల్ నాయుడు, చిన్నంబావి మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.