మార్క్సిజమే  మహోన్నత  మానవతా సిద్ధాంతం

May 5, 2025 - 19:16
 0  2
మార్క్సిజమే  మహోన్నత  మానవతా సిద్ధాంతం

జోగులాంబ గద్వాల 5 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.

CPM రాష్ట్ర నాయకులు కోటంరాజు.
CPM ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ 207వ జయంతి.

 విశ్వ విఖ్యాత ఆర్థికవేత్త, శాస్త్రవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, మహోపా ధ్యాయుడు, గడచిన సహస్రాబ్దిలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారిలో ప్రథముడుగా గుర్తించబడ్డ విశ్వ మానవుడు కారల్‌ మార్క్స్‌  అని సిపిఎం రాష్ట్ర నాయకులు కోటం రాజు,జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి కొనియాడారు సోమవారం సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద కారల్ మార్క్స్ 207వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.


  ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు కోటంరాజు మరియు జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి మాట్లాడుతూ..... ప్రపంచ మానవాళికి విముక్తి మార్గాన్ని చూపిన మహనీయుడు కారల్ మార్క్స్ అని ఆయన సిద్ధాంతం నేటికీ ఆచరణీయమని ప్రపంచంలో కార్మిక వర్గ శ్రమశక్తికి విలువ కట్టిన మేధావి అని కార్మికునికి యజమానికి ఉన్న సంబంధాలను విశదీకరించి చెప్పిన మహా నేత అని అన్నారు. కార్మిక వర్గం పట్ల పెట్టుబడిదారుల దుర్మార్గాలను గమనించి వారిని ఎదిరించడం కోసం ఆనాడే ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని పిలుపునిచ్చాడని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎదుర్కొంటున్న అనేక రకాల ఆర్థిక మాంధ్యాలను ఆనాడే అంచనా వేసి వాటికి పరిష్కార మార్గాలను కూడా చూపగలిగాడని తెలిపారు. మార్క్స్ రచించిన పెట్టుబడి గ్రంథం ప్రపంచ మానవాళికి ఒక విముక్తి మార్గంగా ఉందని అన్నారు. నేటి పాలకులు పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తూ కార్మిక వర్గాన్ని, ప్రజలను బానిసత్వంలోకి నెట్టుతున్నారని అన్నారు. మార్క్స్ జీవిత చరిత్రను నేటితరం యువత చదివి నేర్చుకోవాలని మార్క్స్ చూపిన సిద్ధాంత ఆచరణ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మార్క్స్ చూపిన మార్గంలో కమ్యూనిస్టులు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. 


  ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు కోటంరాజు జిల్లా కార్యదర్శి వెంకటస్వామి తో పాటు జిల్లా కమిటీ సభ్యులు వీవీ నరసింహ, సింగరాజు మద్దిలేటి, నర్మద, అడ్వకేట్ లక్ష్మణ్, పార్టీ నాయకులు హుస్సేన్, తిరుపతమ్మ,మాధవి సిఐటియు నాయకులు గాలెన్న, సీతారాములు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333