ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో మొదటి అవకాశం నిరుపేదలకు కల్పించాలి

జిల్లా కలెక్టర్కు విన్నవించిన. బిఆర్ఎస్ పార్టీ

May 5, 2025 - 19:17
 0  8
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో మొదటి అవకాశం నిరుపేదలకు కల్పించాలి

జోగులాంబ గద్వాల ఐదు మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలు అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇండ్లు లేని వారికి కాకుండా ఇండ్లున్న వారికే లబ్ధిదారులు లిస్టులో వస్తున్నారని ముఖ్యంగా రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు తాము తమ అనుచరులకు ఇప్పించుకుంటున్నారని. చాలా గ్రామాలలో నిరుపేదలు అసలు ఇల్లే లేదు వారు గుడిసెలలో ఉన్నవారు తమ పేరులో లిస్టులో రాలేదని గగ్గోలు పడుతున్నారు వారి గురించి. ఇటు అధికారులు కానీ అటు నాయకులు గాని ఆలోచించకుండా. తమ అనుచరులకి ఇల్లు ఇప్పించుకోవడానికి తమ రాజకీయ పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని. జిల్లా కలెక్టర్ . మరియు ఉన్నత  అధికారులు చొరవ తీసుకొని నిజమైన పేదలను గుర్తించి మొదటి ప్రాధాన్యతగా వారికి అవకాశం కల్పించాలని. బిఆర్ఎస్ పార్టీ కోరుతున్నది. సమగ్రమైన విచారణ జరిపి లబ్ధిదారుల ఎంపిక చేయాలని. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో. జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. 


     ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగర్ దొడ్డి వెంకట రాములు . బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు రెహమాన్ . గాజుల కృష్ణరెడ్డి. టవర్ మక్బూల్. రఫీ మార్లబీడు మహేశ్వర్ రెడ్డి.. మున్నూరు వీరారెడ్డి. తాయిరెడ్డి. రాయల్ పవన్. ఎల్ రాజు తదితరులు.  వినతి పత్రం సమర్పించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333