మాదిగలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి పతనం తప్పదు

MRPS జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు మాదిగ 

Apr 18, 2024 - 14:07
Apr 18, 2024 - 19:46
 0  42
మాదిగలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి పతనం తప్పదు

సూర్యాపేట,19 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట జనజాతర సభలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగపై చేసిన వాక్యాలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుత పార్లమెంటు ఎలక్షన్లలో తెలంగాణలో ఉండబడే మూడు ఎస్సి రిజర్వేషన్ సీట్లలో తక్షణమే రెండు ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గాలు మాదిగలకు కేటాయించాలని లేదంటే మాదిగల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుందని రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో  తన రాజకీయ ఎదుగుదలలో జడ్పిటిసి నుంచి మొదలుకొని ఎమ్మెల్సీ గా ఎమ్మెల్యే గా మల్కాజ్గిరి ఎంపీగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్తుతం తన రాజకీయ ప్రస్థానంలో మాదిగ సోదరులే తన వెంట ఉన్నారని అనేక సందర్భాలలో అనేక సభలలో సమావేశాలలో స్వయానా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన మాట్లాడిన సందర్భాలు ఎన్నో మందకృష్ణ మాదిగ నిర్వహించిన సభలో సమావేశాలు ధర్మయుద్ధం లాంటి సభలకు ముఖ్య అతిథిగా పిలిచి ఇనుముల రేవంత్ రెడ్డిని సమాజానికి అందరికీ తెలియపరచిన మహా నాయకుడు మందకృష్ణ మాదిగ మాదిగలను ఇలానే ఉభయ సభలకు శాసనసభలకు ప్రాధాన్యం తగ్గించాలని చూస్తే మాదిగల కోపానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పతనం తప్పదని అన్నారు.

 సమావేశంలో పాల్గొన్నవారు ఎంఎస్పి జాతీయ నాయకులు చిన్న శ్రీరాములు, రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి, కనుకుంట్లకుట్ల వెంకన్న, ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు బొజ్జ వెంకన్న, రూరల్ మండల అధ్యక్షులు తాటిపాముల నవీన్, ఆత్మకూరు (ఎస్) మండల అధ్యక్షులు మేడి కృష్ణ, పెన్ పహాడ్  మండల అధ్యక్షులు కొండేటి గోపి, చివ్వెంల మండల అధ్యక్షులు సిరిపంగి నవీన్, జిల్లా సీనియర్ నాయకులు బోడ శ్రీరాములు, దైద వెంకన్న, దాసరి వెంకన్న, పుట్టల మల్లేష్, ములకలపల్లి మల్లేష్, గ్యార కనకయ్య, బొడ్డు విజయ్, లింగస్వామి, ములుగురి రాజు, ధైద శీను, చింత మధు, మొదలగు నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333