BIG BREAKING: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. రెండుగా చీలిన ఆప్

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. ఢిల్లీలో ఈ పార్టీ రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా ఆప్‌కు 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. తమకు తాము ప్రత్యేక వర్గంగా ప్రకటించుకున్నారు
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. ఢిల్లీలో ఈ పార్టీ రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా ఆప్‌కు 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. తమకు తాము ప్రత్యేక వర్గంగా ప్రకటించుకున్నారు. ఇంద్రప్రస్త వికాస్ పార్టీ పేరుతో ఈ రెండో వర్గం ఏర్పడినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
రాజీనామా చేసిన రెబల్ కౌన్సిలర్లలో.. ముఖేష్ గోయల్, హేమంచంద్ గోయల్, దినేష్ భరద్వాజ్, హిమానీ జైన్, ఉషా శర్మ, సాహిబ్ కుమార్, రాఖీ కుమార్, అశోక్ పాండే, రాజేష్ కుమార్, అనిల్ రాణా, దేవేంద్ర కుమార్, హిమానీ జైన్ ఉన్నారు. వీళ్లకు హేమచంద్ గోయల్ నాయకత్వం వహించనున్నారు.
మూడు నెలల క్రితం ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. ఆ తర్వాత తాజాగా మరో 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఇప్పుడు వీళ్లు ఇంద్రప్రస్త వికాస్ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ఆప్ ఇలా రెండుగా వర్గాలుగా చీలిపోవడం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది.
???????????? ???????????????????????????? ???????????????????????????? ???????????????????????? ???????????????? ???????????????? ???????? #unseenwthsinath
https://whatsapp.com/channel/0029VayMNozBlHpcCGuDOV20