స్నేహ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

Apr 18, 2024 - 13:23
Apr 18, 2024 - 18:49
 0  18
స్నేహ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి:- స్నేహ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు ఆత్మకూరు ఎస్ మండలం లోని ఏపూర్ గ్రామంలో స్నేహ యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ అధ్యక్ష కార్యదర్శులు పోకబత్తిని వంశీ, కల్లెపల్లి కిరణ్*లు మాట్లాడుతూ ఎండాకాలం లో సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఎండలు బాగా మండిపోతున్నవి కనుక పాదచారులు మరియు ఏపూర్ నుంచి సూర్యాపేటకు వివిధ గ్రామాలకు ప్రయాణాలు సాగిస్తున్నటువంటి ప్రయాణికులకు యాచకులకు అందరికీ మంచినీళ్లు అందించాలని లక్ష్యంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని వారు అన్నారు. అందరూ కూడా ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు పోకబత్తి నవీన్, కస్తూరి నాగరాజు బోయిళ్ళ రంజిత్,వర్ధ రాము, కస్తూరి నరేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.