మా సమస్యలను పరిష్కారం చేయరా? మంత్రిని నిలదీసిన శ్రీశైలం నిర్వహితుడు పెబ్బేటి నారాయణరెడ్డి

Nov 19, 2025 - 19:47
 0  0
మా సమస్యలను పరిష్కారం చేయరా? మంత్రిని నిలదీసిన శ్రీశైలం నిర్వహితుడు పెబ్బేటి నారాయణరెడ్డి

19-11-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. చిన్నంబావి  మండలంలో పర్యటించిన జూపల్లి కృష్ణారావును శ్రీశైలం నిర్వహితులు కలిసి మా సమస్యలు పరిష్కారం చేయండి మంత్రిని కలిసిన శ్రీశైలం 98 జీఓ నిర్వాసితులు.

శ్రీశైలం ముంపు బాధితుల 40 ఏళ్లుగా రాజకీయ అధికారుల ఉట్టి మాటల వాగ్దానమే! పెబ్బేటి నారాయణ రెడ్డి?

 చిన్నంబావి మండల పరిధిలోని పర్యటించిన సందర్భంగా జూపల్లి కృష్ణారావు కలిసిన నిర్వాసితులు ఈ సందర్భంగా నిర్వాసితుడు పెబ్బేటి నారాయణరెడ్డి మాట్లాడుతూ...

శ్రీశైలం జలాశయం బ్యాక్‌ వాటర్ ముంపుతో దెబ్బతిన్న 67 గ్రామాల ప్రజలు 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న 98 జీవో మరోసారి ప్రజల ఆవేదనకు కారణమైంది. గ్రామాలు నీటిలో మునిగిపోవడంతో అనేక కుటుంబాలు తమ భూములు, ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆశాజనకంగా జారీ చేసిన 98 జీవో ఇప్పటి వరకు అమలుకాకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర నిరాశ, ఆగ్రహం వ్యాపిస్తోంది.ముంపు నష్టాల తర్వాత బాధిత కుటుంబాలను పునరావాసం చేయడమే కాకుండా, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి దాదాపు నాలుగు దశాబ్దాలు దాటిపోయాయి. అయితే ప్రతి ఎన్నికల సమయంలో మాత్రమే ఈ జీవో పేరు రాజకీయ నాయకుల హామీలలో వినిపిస్తున్నా… అమలు విషయానికి వస్తే ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు అని బాధితులు వేదన వ్యక్తం చేస్తున్నారు.67 గ్రామాలకు చెందిన అనేక మంది యువకులు పూర్తిస్థాయి అర్హతలు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఒక్కరికైనా 98 జీవో ప్రయోజనం అందకపోవడం ప్రజల్లో గాఢ అసంతృప్తి కలిగిస్తోంది. “మీరు కూడా సుమారు 24 సంవత్సరాలు అధికారంలో, ప్రజా జీవితం లో ఉన్నా… 98 జీవో అమల్లో ఒక అడుగు ముందుకు పడలేదు” అని 98 జీవో నిర్వాసితుల ప్రజలు మంత్రికి తమ గుండెల్లోని బాధను తెలుపుతున్నారు.“మా గ్రామాలు మునిగిపోయాయి… భూములు పోయాయి… మా జీవనం చిద్రమైంది. కనీసం 98 జీవో ద్వారా ఇచ్చిన హామీ అయినా నెరవేర్చండి” అంటూ గ్రామస్తులు మంత్రికి అభ్యర్థిస్తున్నారు.ప్రజల తరఫున, అలాగే ఇతర ముంపు గ్రామాల ప్రజల తరపున కూడా, 98 జీవోను తక్షణం అమలు చేసి బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వానికి నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 ఈ కార్యక్రమంలో పెబ్బేటి నారాయణరెడ్డి తో పాటు డాగోజీరావు, గద్వాల్ గోవిందు, బిక్కిం విష్ణు సాగర్, పెద్దమారు శ్రీను, రంగస్వామి, రమేష్ సింగ్, కురుమయ్య, ఆలీ భాష, బాలకృష్ణ తో పాటు శ్రీశైలం నిర్వాహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State