చట్టబద్ధమైన దత్తత గురించి అవగాహన కార్యక్రమం

Nov 19, 2025 - 19:30
 0  7
చట్టబద్ధమైన దత్తత గురించి అవగాహన కార్యక్రమం
చట్టబద్ధమైన దత్తత గురించి అవగాహన కార్యక్రమం

 జోగులాంబ గద్వాల 19 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఇటిక్యాల జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ,  బాలల పరిరక్షణ విభాగం, జోగులాంబ గద్వాల జిల్లా, వారి ఆధ్వర్యంలో ఇటిక్యాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్యాలయంలో వైద్య సిబ్బందికి, ఆశ కార్యకర్తలకు  వీరికి చట్టబద్ధమైన దత్తత గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
 

ఈ కార్యక్రమంలో  జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి ఛైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జోగు రవి మాట్లాడుతూ

మాతృత్వం ఒక వరం , అందుకు దత్తత మరో మార్గం.

పిల్లలను అమ్మడం కొనడం, మరియు చట్ట విరుద్ధంగా పెంచుకోవడం నేరమని తెలియజేయడం జరిగింది.

బాలల న్యాయ (బాలల రక్షణ మరియు సంరక్షణ) చట్టం, 2015 ప్రకారం

1. చట్ట విరుద్దంగా పిల్లలను పెంచుకోవడం నేరం... చట్ట విరుద్దంగా పిల్లలను దత్తత ఇచ్చినా,  మరియు తీసుకున్న వారికి 3 సం॥ల కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా.

2. ఏ ప్రయోజనం కోసం అయినా ఒక బాలుడు/బాలిక అమ్మటం కానీ కొనటం కాని జరిగితే వారికి ఐదేళ్ళ వరకూ కఠినకారాగార శిక్ష దాంతోపాటు ఒక కలక్ష రూ॥ల జరిమానా విధించబడును. అంతేకాకుండా వైద్యశాల/పర్సింగ్ హోమ్/ ప్రసూతి గృహంలో పనిచేసే సిబ్బంది పై నేరానికి పాల్పడితే వారికి 3 సం॥ల వరకు జైలు శిక్ష విధించబడును.

ప్రభుత్వమే జిల్లా కలెక్టర్ గారి ద్వారా సులభంగా వేగంగా న్యాయబద్ధంగా ద్వారా దత్తత ఇవ్వడం జరుగుతుంది.

ఇప్పుడు దత్తత చాలా సులభం ఆన్లైన్లో www.cara.nic.in website లో ఇంటి వద్దనుండే ఈ క్రింద తెల్పబడినటువంటి పత్రములతో దత్తత కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

 దత్తతకు కావలసిన పత్రాలు. 

> పాన్కార్డు, దంపతుల ఫోటో.

> నివాస ధృవీకరణ పత్రం (ఆధార్కార్డు/ఓటర్ గుర్తింపుకార్డు/పాస్పోర్టు/డ్రైవింగ్ లైసెన్స్)

> ఆదాయ ధృవీకరణపత్రం (సాలరీ స్లిప్/ఆదాయ ధృవీకరణ పత్రం లక్ష రూపాయలు ఆదాయం)

> వివాహ ధృవీకరణ పత్రాలు (దంపతులిద్దరివి)

> దంపతులిద్దరికి ఎటువంటి దీర్ఘకాళిక లేదా ప్రాణాంతక వ్యాధులు లేవని దత్తతకు అర్హులని డాక్టర్ చేత పొందబడిన ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్.

> దరఖాస్తు చేసుకునే సమయంలో 6000 రూ॥లను మరియు పాప / బాబును తీసుకునేటప్పుడు 50,000 రూ॥లను ప్రభుత్వమునకు డి.డి. రూపంలో చెల్లించవలెను.

దత్తతకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ కార్యాలయం , శిశు గృహ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా సంక్షేమాధికారి  సంప్రదించాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో MLHPఅనూష, హెల్త్ సూపర్వైజర్ శేఖర్   వైద్య సిబ్బంది, ఆశా వర్కర్స్, మరియు ఇటిక్యాల గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333