మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

Nov 25, 2025 - 19:04
 0  4
మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

మరిపెడ 25 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎలమంచిలి తండా గ్రామపంచాయతీలో మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివో ఏ భద్రు నాయక్ అన్నారు. మంగళవారం ఎలమంచిలి తండా గ్రామపంచాయతీ నందు చైతన్య వివో ఏ ఇందిరా కాంతి మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వివో ఏ బద్రు నాయక్ ఆయన మాట్లాడుతూ  మహిళలకు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాల ను మంజూరు చేస్తుందన్నారు. వరి కొనుగోలు కేంద్రాలను పీఎసీఎస్ నుండి కాకుండా ఐకెపీ ఆధ్వర్యంలో మహిళ సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కొనుగోలు కేంద్రాలను  ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీరల పంపిణీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మరిపెడ మండలం ఎలమంచిలి తండా గ్రామపంచాయతీకి చెందిన మహిళ లబ్ధిదారులకు బద్రు నాయక్ చేతులమీదుగా చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు బానోతు వీరన్న, వివో అధ్యక్షురాలు భూక్య లక్ష్మి, కార్యదర్శి బానోతు పద్మ, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333