ముస్లిం మైనారిటీలకు స్మశానవాటిక స్థలంను కేటాయించండి
జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. మండలంలోని ములకలపల్లి గ్రామంలో ముస్లిం మైనార్టీల స్మశాన వాటిక స్థలం కుదించుకుపోయి ఉన్నది. గ్రామం లో మరణిస్తే ఖననం చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి గ్రామంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ 306లో ముస్లిం మైనార్టీల కొరకు స్మశాన వాటికను కేటాయించాలని ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికుర్ రహిమాన్, మొహమ్మద్ రహమతుల్లా, కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో షఫీ, సాధతుల్ల, రుక్మత్ తదితరులు పాల్గొన్నారు.