వరంగల్ జిల్లాలో నిత్య పెళ్లికూతురు ఘరానా మోసం

Nov 25, 2025 - 19:34
 0  2
వరంగల్ జిల్లాలో నిత్య పెళ్లికూతురు ఘరానా మోసం

పెళ్లయి కూతురు ఉన్నా, మాట్రిమోని ద్వారా ఇంకో పెళ్లి

-- విషయం బయటపడడంతో 8.5 తులాల బంగారంతో పరారైన మహిళ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిషకవి ఇందిరా(30) అనే మహిళను మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి చేసుకున్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన మట్టపల్లి దేవేందర్ రావు(31) అనే వ్యక్తి 

రూ.4 లక్షలతో ఘనంగా వివాహ వేడుకలు జరిపించి, మహిళకు  8.5 తులాల బంగారం కానుకగా పెట్టిన వరుడు

పెళ్లయిన రెండు రోజులకే మహిళ ప్రవర్తనలో తేడా గమనించి, ఆమె ఫోన్ చెక్ చేసిన దేవేందర్ రావు 

దీంతో ఆమెకు ముందే పెళ్లయిందని, ఒక కూతురు కూడా ఉందని గుర్తించి, మహిళను నిలదీయగా, పెళ్లయిన మాట వాస్తవమే కానీ విడాకులు తీసుకున్నాని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన ఇందిరా

ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగగా, ఉదయం లేచే సరికి బంగారం, నగదుతో పారిపోయిన కిలాడి లేడీ

మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు, మహిళ, ఆమె తల్లిపై కేసు నమోదు చేసిన బాధితుడు

ఇందిరా గతంలో కూడా ఇద్దరు, ముగ్గురు యువకులను ఇదే తరహాలో మోసం చేసినట్లు గుర్తించిన పోలీసులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333