మహిళను అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులపై14 రోజులు రిమాండ్

ఎస్సై వెంకట్ రెడ్డి

Sep 14, 2025 - 11:34
Sep 14, 2025 - 11:34
 0  235
మహిళను అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులపై14 రోజులు రిమాండ్

అడ్డగూడూరు 13 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని అజీంపేట గ్రామంలో మహిళతో అసభ్యకరంగా వ్యవహరించిన వ్యక్తులకు 14 రోజుల రిమాండ్ విధించిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే వెల్దేవి గ్రామానికి చెందిన ఉడుగు జయమ్మ భర్త మారయ్య కొడుకు స్వామి జయమ్మ అను మహిళ తన అమ్మ గ్రామమైన ఆజీంపేట ఊర్లో తనకు సొంత ఇల్లు ఉంది. ఆ ఇల్లును సొంత అవసరాల కొరకు అమ్మినది.ఇంటి విషయంలో తన సొంత తమ్ముడైన ఇటికాల పరశురాములుతో గత కొన్ని రోజుల నుండి గొడవలు జరుగుతున్నాయి.12–09–2025 శుక్రవారం రోజున సుమారు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఊడుగు జయమ్మ కొడుకు స్వామి ఇద్దరు కలిసి తన అమ్మను చూడడానికి ఆజంపేట గ్రామానికి వెళ్లారు.ఆ సమయంలో తన తల్లి ఇంట్లో లేనందున తమ్ముడైన పరుశరాములు ఇంటికి వెళ్ళగా!పరశురాములు అనే వ్యక్తి తన అక్కతో గొడవ పడడంతో అక్కడే ఉన్న తన బాబాయ్ కొడుకు ఇటికల శ్రీను తండ్రి మల్లయ్య కలిసి జయమ్మును విచక్షణ రైతంగా కర్రలతో కొట్టినారు. అడ్డుకోపోయిన జయమ్మ ను అట్టి ముగ్గురు వ్యక్తులు సదరు మహిళా అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టినారు.వెంటనే చుట్టుపక్కల వారు వచ్చి వారిని ఇట్టి గొడవ నుండి సర్ది చెప్పారు.ఉడుగు స్వామి 100 నెంబర్ కు డయల్ చేయగా జరిగిన విషయం పోలీసులకు చెప్పగా!సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించారు.ఇట్టి విషయం పై జయమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారించి అట్టి ముగ్గురు వ్యక్తులపై చట్ట ప్రకారం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు.జడ్జి ముగ్గురు వ్యక్తులపై 14 రోజుల పాటు రిమాండ్ విధించారని ఎస్సై కే వెంకటరెడ్డి తెలిపారు.