కోర్టు వినూత్న నిర్ణయం: సామాజిక సేవ రూపంలో శిక్ష అమలు

జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐ.పి.ఎస్. *
జోగులాంబ గద్వాల 13 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఐజ శిక్ష అంటే కేవలం దండన మాత్రమే కాదని, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఉండాలని వినూత్నమైన తీర్పును ఇవ్వగా అట్టి తీర్పును జిల్లా పోలీసులు అమలు చేశారు. మద్యం సేవించి మోటర్ సైకల్ ను నడిపిన నిందితునికి గద్వాల్ ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణంలో మొక్కలు నాటమని నిన్న శిక్ష విధించగా, ఇట్టి శిక్షను జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐ పి ఎస్ ఆదేశాల మేరకు అయిజ ఎస్ ఐ , అమలుపరచారు. కేసు వివరాలు: 07.05. 2025 రాత్రి సమయంలో ఐజ "టి " జంక్షన్ వద్ద మూగోనిపల్లి గ్రామముకు చెందిన కురువ శ్రీరామ్ పోలీస్ వారికి తనిఖిలలో మద్యం సేవించి మోటర్ సైకల్ ను నడిపుతూ పట్టుబడగ ఇట్టి విషయంలో అయిజ పోలీస్ వారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేయడం జరిగింది.
కోర్టు తీర్పు, సామాజిక సేవ: ఇట్టి కేసులో నిన్న అనగా తేది: 12.09.2025 శుక్రవారం రోజు జుడిసియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్ట్ నేరెళ్ళ వెంకట హైమా పూజిత * , కొత్త చట్టాలను అనుసరించి నిందితులకు వినూత్నమైన శిక్ష విధించారు. అందులో భాగంగా నిడితునికి గద్వాల్ ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణంలో మొక్కలు నాటమని శిక్ష విధించడం జరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అయిజ ఎస్ఐ. శ్రీనివాస్ ఈ శిక్షను పర్యవేక్షించారు. నిందితుని తో 10 మొక్కలు తెప్పించి హాస్పిటల్ ఆవరణములో నాటిoచడం జరిగింది. కోర్టు ఇచ్చిన తీర్పు, శిక్షలు కేవలం దండన కోసమే కాకుండా, సమాజానికి ప్రయోజనం కలిగేలా కూడా ఉంటాయని రుజువు చేసింది. ఇది చట్టం యొక్క కొత్త, సామాజిక దిశకు ఒక సంకేతం. పోలీస్ సిబ్బంది తెలిపారు.