మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు"చింత గుర్తి గ్రామంలో 35 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యర గార్ల హనుమంతరావు

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : రఘునాథపాలెం మండలం..... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖమ్మం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి సిఫారసు మేరకు చింతగుర్తి గ్రామంలో 35 మందికి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ గౌరవనీయులైన ఖమ్మం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు గారు , ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ప్రజా ప్రభుత్వం ప్రజల జీవితాల్లో వెలుగు నింపిందని అన్నారు. లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఖమ్మం శాసనసభ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తమ్మినేని నాగేశ్వరావు గారు, కొత్త కొమరయ్య గారు సీతారామయ్య గారు మండల అధ్యక్షులు వాంకుడోతు దీప్ల నాయక్ గారు ఆత్మ కమిటీ చైర్మన్ దివిశాల వెంకటేశ్వర్లు గారు. తాత రఘురాం గారు ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ కార్యదర్శి హౌసింగ్ ఏఈ గారు చింతగుర్తి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమానికి విజయవంతం చేయడం జరిగింది .