డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ రాగిని కి శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది..

సూర్యాపేట : జిల్లా కేంద్రంలో శ్రీ స్వాతి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో సోమవారం డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ రాగిని డిఎన్ బి ని సిబ్బంది పుష్పగుచ్చలతో శాలువతో ఘనంగా సన్మానించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా డాక్టర్ రాగిని మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందోఅంతప్రాముఖ్యమైందని, వైద్యో నారాయణ అంటూ వైద్యులనుదేవునితోపోలుస్తారు.దేవుడు మనుషులకు జన్మనిస్తే వైద్యులు చికిత్స ద్వారా పునర్జన్మ ఇస్తారనీ,వృత్తిలలో పవిత్రమైన వృత్తిగా భావిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమం లో శ్రీ స్వాతి మల్టీ స్పెషాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.