విధులకు ఆటంకం కలిగించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
జోగులాంబ గద్వాల 9జులై 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : విచారణకు వెళ్లిన రెవెన్యూ అధికారుల విధులకు ఆటంకం కలిగించి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీఆర్‌ఎస్‌ఏ) జిల్లా ప్రధాన కార్యదర్శి అజిత్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం గద్వాల మండలం పరుమాల శివారులో గల పొలం సర్వే కోసం విచారణకు వెళ్లిన ఆర్ఐ రామకృష్ణను, సిబ్బందిని ఇటిక్యాల హెడ్ కానిస్టేబుల్ జ్యోతిప్రకాష్, అతని కుమారుడుతో పాటు భార్య అడ్డుకోవడంతోపాటు. అధికారుల్ని అడ్డుకొని, అసభ్యపదాజాలంతో తిడుతూ విధులకు ఆటంకం కలిగించారు. ఇందుకు నిరసనగా ఈ రోజు టీజీఆర్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో గద్వాల తహసీల్దార్ కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకొని, రెవెన్యూ అధికారులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గద్వాల తహసీల్దార్ మల్లికార్జున్, ఆర్ఐ, అధికారులు పాల్గొన్నారు.