భారత న్యాయ చట్టలపై అవగాహనా కార్యక్రమం 

Jul 6, 2024 - 17:25
Jul 6, 2024 - 17:54
 0  8
భారత న్యాయ చట్టలపై అవగాహనా కార్యక్రమం 

సూర్యాపేట,జూలై 06 జూలై 2024తెలంగాణవార్త రిపోర్టర్:- మహిళా శిశు సంక్షేమ శాఖ లోని మహిళా సాధికారత కేంద్రం వారు జిల్లా సంక్షేమ శాఖ అధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవా సంస్థ తో కలిసి స్థానిక సూర్యాపేట పట్టణంలో గల వికాస్ ఫార్మసీ కళాశాల నందు నూతన భారత న్యాయ చట్టలపై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా సివిల్ జడ్జి, చీఫ్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ &జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ శ్రీవాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి k సురేష్ పాల్గొని శ్రీవాణి సమావేశాన్ని ఉదేశించి మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత గురించి అవగాహనా కల్పిస్తూ మహిళలకు ఉచిత న్యాయ సహాయం మహిళలకు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ఇంటి నుండే ఇమెయిల్ వాట్సాప్ ద్వారా పిర్యాదు చేయవచ్చు  కొత్త చట్టలలో శిక్షలు మరియు జరిమానాలా పరిధి పెంచిన వాటి గురుంచి వివరించడం జరిగింది అదే కార్పొరేట్ కళాశాలలో ఉన్నటువంటి ర్యాగింగ్ ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణిస్తే విధించే శిక్షల గురించి తెలియచేశారు అదే విదంగా మహిళా సాధికారత కేంద్రం వారి 100 రోజులు ప్రత్యేక అవగాహనా కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చినటువంటి భారత న్యాయ చట్టల గురించి కళాశాలలో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం అని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సత్యనారాయణ పిల్లే , బొల్లెద్దు వెంకటరత్నం , పి.వాణి . జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ లు, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, she team,డీసీపియూ సిబ్బంది,సఖి సిబ్బంది భరోసా సిబ్బంది మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333