ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి - ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్

విద్యార్థుల సమస్యలను పట్టించుకోని  డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి - ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్

Jul 6, 2024 - 17:23
Jul 6, 2024 - 17:56
 0  24
ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి - ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్

డిండి, జూలై 06 జూలై 2024తెలంగాణవార్త రిపోర్టర్:- విద్యార్థుల సమస్యలు పట్టించుకోని డిండి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్  ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా  ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు, ఏఐవైఎఫ్  జిల్లా ఉపాధ్యక్షులు ఎనమల్ల నవీన్ మాట్లాడుతూ....పాఠశాల పరిసరాలను, విద్యార్థులు ఉన్నటువంటి  గదులను పరిశుభ్రంగా ఉంచకపోవడం వలన గత వారం 10 రోజుల నుండి దాదాపు 16 మంది విద్యార్థులను ఎలుకలు  కలవడం జరిగింది

 పరిసరాల అపరిశుభ్రత వలన విద్యార్థులు నిత్యం అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు కూడా  భద్రత కొరబడిందని గత వారం రోజుల నుంచి ఉడికి ఉడకని ముద్దలాంటి అన్నం పెడుతున్నారని అన్నం తినలేక విద్యార్థులు పస్తులు ఉండాల్సిన  పరిస్థితి ఏర్పడిందని  తిన్న విద్యార్థులు అనారోగ్యానికి గురవుతూన్నారని వీటిపై ప్రిన్సిపాల్ గారిని వివరణ  అడగగా నిర్లక్ష్యంగా పొంతన లేని సమాధానాలు  చెప్తావున్నారని ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వలెనే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని  విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఘటనపై ఆందోళన చెందుతున్నారని  వెంటనే పై అధికారులు ఈ ఘటనపై విచారణ చేసి ఈ ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్ మరియు సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యాయం జరిగే వరకు  పోరాటం చేస్తామని  హెచ్చరించారు 

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు సూరిగి వినయ్,డివిజన్ సహాయ కార్యదర్శి ఎనిమల్ల సాయి,ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్  నాయకులు నూతనగంటి హనుమంతు,బి వెంకటేష్, బి అరవింద్,శశి,అరుణ్, జగదీష్, మహేష్, శశాంత్,భాను తదితరులు ఉన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333