అమావాస్య రోజు భక్తుల సందడి

జోగులాంబ గద్వాల 30 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి;- మల్దకల్ ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా సోమవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో దేవాలయ పరిసరాలు నిండిపోయాయి. బ్రహ్మోత్సవాలు అనంతరం భక్తులు అనేకమంది పాల్గొని మొక్కులు సమర్పించారు.