బెట్టింగ్ యాప్ లకు పాల్పడితే కట్టిన చర్యలు*

Mar 19, 2025 - 08:45
Mar 19, 2025 - 08:46
 0  8

యువత సన్మార్గంలో ప్రయాణించాలి

అక్రమ బెట్టింగ్ యాప్స్ పై ప్రత్యేక నిఘా

ఐపీఎల్ లో బెట్టింగ్ కు పాల్పడవద్దు

నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు

యువత బెట్టింగ్ యాప్ లకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో ఉండి మంచిగా చదివి ఉన్నత స్థాయిలకు ఎదగాలని *నలగొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు* అన్నారు. నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం నల్గొండ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ చౌరస్తాలో బెట్టింగ్ యాప్ లపై ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ మాటున ప్రమాదకర మాల్ వేర్ ఉందని, ఫెక్ లింక్స్ తో వ్యక్తి గత సమాచారం, అకౌంట్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్న క్రమంలో గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈఅక్రమ బెట్టింగ్ యాప్‌లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసే ఎవరిపైనా ఉపేక్షించేది లేదని ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి,

మీ చుట్టూ ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 కు కాల్ చేసి సమాచారాన్ని అందించాలన్నారు

రానున్న క్రికెట్ ఐపీఎల్ లో బెట్టింగులకు పాల్పడవద్దని హెచ్చరించారు.యువత,విద్యార్థులు తక్కువ సమయంలో అధిక డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో ఈ బెట్టింగ్ యాప్ లలో పాల్గొని తీవ్రంగా నష్టపోయి,అప్పులపాలై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఒక్కొక్కసారి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ వలన కలిగే పరిణామాల గురించి ప్రజలకు ఎస్సై క్షుణ్ణంగా వివరించారు...

...........

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333