నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు.

Feb 14, 2026 - 21:43
Feb 14, 2026 - 22:49
 0  21
నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు.

నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న *కష్టం* రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువుల్లాటివి. అందుకే మనకు అన్ని ఉన్నప్పుడే* మనతో వచ్చే వారిని *గుర్తు* పెట్టుకోవాలి. ఏమీ లేనప్పుడు* మనతో వచ్చే వారిని గుండెల్లో పెట్టుకోవాలి. అందరూ బాగుండాలి. అందులో మీరు మీ కుటుంబ సభ్యులు మరీ బాగుండాలి* .

   ఉన్నది ఒక్కటే *జీవితం*. నలుగురితో కలిసిమెలిసి *నవ్వుతూ, నవ్విస్తూ* గడిపేద్దాము. *అవినీతి* ఒంటరిగా *బతకలేదు* నలుగురి తోడు కావాలి. *నీతికి* ఎవరితో అవసరం లేదు ఒంటరిగా అయినా *జీవించగలదు*. తిన్నది *కడుపు* నుంచి వెళ్ళిపోతుంది కానీ *అన్నది* మాత్రం *మనసులో* ఎప్పటికీ ఉండి పోతుంది. అందుకే *తొందర* పడి *నోరు* జారకూడదు .

  రోడ్డు మీద రాయిలా ఉండకు, ఎవరో ఒకరు తన్నేస్తారు ఊరి చివర *కొండలా* వుండు, *తాకడానికి* కూడా ఆలోచిస్తారు. *కష్టాలు* ఏడ్చినా పోవు. *సుఖాలు* నవ్వితే రావు. *గుండె* నిబ్బరంతో *నవ్వుతూ* పోరాడితే నేటి *కష్టాలే* రేపటి *సుఖాలవుతాయి* ‌.

అర్థం చేసుకోలేని వారి దగ్గర *వాదన* అనవసరం. *లోపాలు* వెతికే వారి దగ్గర *వివరణ* అనవసరం. అర్హత లేని వారు అనే మాటలకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి కోసం *రోదన* అనవసరం. మనం మంచి* వాళ్ళుగా *జీవిస్తే* చాలు దానిని ఎవరి వద్ద *నిరూపించుకోవాలని ప్రయత్నించవలసిన* అవసరం లేదు. ఎవరు *నీకోసం* రారు. *నీ యుద్ధం* నువ్వే చేసుకోవాలి. *నీ బలహీనతను* పంచుకుంటే అది *పక్కోడికి* ఆయుధమవుతుంది. *నిజాయితీగా* ఉండడం వల్ల వచ్చేది *విలువే* కానీ లాభం కాదు. లోకం పోకడ తెలుసుకో, అవసరాన్ని బట్టి ఇక్కడ బంధాలు మారుతాయి. అవసరం కోసం ఆత్మను అమ్ముకునే బతుకు అడివిపాలు. నీ నీడను సైతం తలెత్తుకుని చూసేలా నీ నడకను మార్చుకో, ఎదుటి వాడి మెప్పుకోసం *నీ వ్యక్తిత్వాన్ని బలివ్వకు. *లోకం* నిన్ను చూసి *వణికేలా* నీ మౌనానికి పదును పెట్టు .

మీ✍️ డాక్టర్ కృష్ణ బంటు,

గోల్డ్ మెడలిస్ట్, సీనియర్ జర్నలిస్టు, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత, హ్యూమనిస్ట్, సోషల్ సైంటిస్ట్, సొసైటీ ఇంజనీర్, మోటివేషనల్ స్పీకర్, పొలిటికల్, ఎకనామిక్, సోషల్ అనలిస్ట్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333