ఇచ్చిన హామీలను అమలు చేయాలి.సీఐటీయూ డిమాండ్

Mar 19, 2025 - 18:28
Mar 19, 2025 - 18:31
 0  6

జోగులాంబ గద్వాల 19 మార్చ్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లకు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏ వెంకటస్వామి వివి నరసింహ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం)రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం 6 గంటలకే ఆశా కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ముందు చేరుకొని తమ ధర్నాను కొనసాగించారు.


    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆశా వర్కర్లకు 18 వేల రూపాయల వేతనం చెల్లిస్తానని హామీ ఇచ్చిందని అన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం  పూర్తయిన ఇప్పటివరకు ఆశాలకు ఇచ్చిన  హామీలను అమలు చేయలేదని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా సమస్యల పరిష్కారం కోసం  ఉద్యమిస్తున్న ఆశాలపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. నేటి ధర్నా కార్యక్రమానికి రాకుండా ఆశా కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని కార్మిక వర్గంపై గత ప్రభుత్వం అనుసరించి నిరంకుశ విధానాలే,BRS పార్టీ పతనానికి కారణమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా వ్యవహరించవద్దని హితవు పలికారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలోనే ఆశా వర్కర్లకు 18000 ఫిక్స్డ్ వేతనాన్ని నిర్ణయించి పిఎఫ్ ఈయస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ సునీత మాట్లాడుతూ ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తిచేసిన ఆశాలకు ఏఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని, వెయిటేజ్ మార్కులు నిర్ణయించి వెంటనే అమలు చేయాలని , ఏఎన్ సి, పిఎన్ సి తదితర టార్గెట్లను విధించి తమను ఇబ్బందులకు గురి చేయవద్దని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించి ఇస్తున్న పారితోషకాలలో  సగం పెన్షన్ గా నిర్ణయించి అమలు చేయాలని తదితర న్యాయబద్ధమైన డిమాండ్ల గురించి పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు, ఖాళీగా ఉన్న ఆశా పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి  అవకాశాలు కల్పిస్తే  ఆశా వర్కర్లకు కూడా పని భారాన్ని  తగ్గించినట్లు అవుతుందని అన్నారు .అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ లు నర్సింగ రావు లక్ష్మి నారాయణ గార్లకు అందజేశారు ఈనెల 21 న PHC ల ముందు జరిగే ధర్నాలకు 24 న జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఆశాలు అధిక సంఖ్యలో హాజరై ప్రభుత్వ మెడలు వంచి ఫిక్స్డ్ వేతనం సహా ఇతర హామీలు  సాధించుకునే వరకు దీర్ఘ కాలంలో పోరాడతామని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కాంతమ్మ పద్మ నాగ ప్రమీల రేణుక సునీత అభేద శ్వేత జయలక్ష్మి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333