బీసీలకి 42 శాతం రిజర్వేషన్ పై బీసీ సంఘాలు హర్షం..

మునగాల 27 సెప్టెంబర్ 2025
తెలంగాణ వార్త ప్రతినిధి :-
బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో నెంబర్ తొమ్మిదిని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ సంఘాల హర్షం ప్రకటించాయి ఈ సందర్భంగా బీసీ సేన జాతీయ కార్యదర్శి డాక్టర్ నరాల రుక్కా రావు బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీసీ ఉద్యమ నేత రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య 40 సంవత్సరాలుగా బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తూ స్థానిక సంస్థల రిజర్వేషన్లు కోసం హైకోర్టులో ఫీల్ దాఖలు చేసి హైకోర్టు కులగనన చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది బీసీ హక్కుల కోసం పోరాడారని గుర్తు చేశారు ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ సంఘాల నాయకులు హర్షం ప్రకటించారు ఈ కార్యక్రమంలో అక్కినపల్లి ఉపేందర్ బడేటి సత్యం మండవ లింగయ్య హసేన్ హుజూర్ తదితరులు పాల్గొన్నారు