బెక్కేo గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ

Jan 3, 2026 - 20:34
 0  21
బెక్కేo గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ

గ్రామ నూతన సర్పంచ్ కమలాబాయి 

 చిన్నంబావి మండలం 03జనవరి 2025తెలంగాణ వార్త : చిన్నంబావి మండల పరిధిలోని బెక్కెం గ్రామ పంచాయతీలో నూతన గ్రామ సర్పంచ్ కమలాబాయి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి పనులు మొదలు పెట్టారు. అందులో భాగంగానే  గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో బెక్కెం నుడి మియాపూర్ వెళ్లే రోడ్డుకు ఇరువైపుల ఉన్న కంపతారు చెట్లు, ఫారం కంప తో రాకపోకల యందు ఇబ్బంది పడుతున్నారు. ఇట్టి విషయాన్ని గ్రామస్తులు నూతన సర్పంచ్ కమలాబాయి దృష్టికి తీసుకొని రాగా తక్షణమే ఇరువైపుల ఉన్న కంప చెట్లను తొలగించి గ్రామ ప్రజలకు సరైన రహదారి చేయడం జరిగింది. అదే విధంగా గ్రామ సభకు గ్రామంలో ఉన్న శాఖలన్నియు అందరూ హాజరు అయి ఈ అందరి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చర్చించు కోవడం జరిగింది. గ్రామ పంచాయతీ లో ఉన్న వార్డులలో సమస్యలన్నీ పరిష్కరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు అందరూ సంతోషంతో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ కమలబాయి, బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు దారాసింగ్, ఉప సర్పంచ్ శివ, గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొనడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333