శ్రీ తిమ్మప్ప స్వామికి హోరెత్తిన భక్తులు.
జోగులాంబ గద్వాల 11 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్ కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. దేవాలయానికి ఉదయం నుండే భక్తుల రాక ఉండటంతో దేవాలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మల్దకల్ గ్రామానికి చెందిన పి. మన్విత సంతోష్ కుమార్ కూతురు జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి మధుసూదనాచారి, రవి ఆర్యవైశ్య సంఘం నాయకులు మనసాని నాగరాజు, నరేందర్, ఉప్పరి నారాయణ, నాయక మధు తదితరులు పాల్గొన్నారు.