బిఆర్ఎస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి
అడ్డగూడూరు 26 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పార్టీ కార్యాలయంలో ఎగరవేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య,మోత్కూర్ మార్కెట్ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,వార్డ్ మెంబర్ గజెలీ రవి,బాలేoలా పరశురాములు మండల యువ నాయకులు గూడెపు పరమేష్,మహేష్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు పాల్గొని మిఠాయిలు స్వీట్లు పంచుకున్నారు.