సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం

Mar 16, 2026 - 20:28
Mar 16, 2026 - 22:03
 0  8
సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం

సూర్యాపేట షీ టీం

 సూర్యాపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ 

సూర్యపేట, 17  మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:-  ఎస్పీ కె నరసింహ ఆదేశాల మేరకు, సూర్యాపేట DSP ప్రసన్న కుమార్ గారు, సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ వెంకట్ గారు, షీ టీం WSI నీలిమ గారు, సూర్యాపేట పట్టణం గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ లో షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, భరోసా సెంటర్ గురించి పోలీసు కళాభృందంతో విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. 

  సూర్యాపేట షీ టీం మహిళా SI నీలిమ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కే నరసింహ అధ్వర్యంలో షీ టీమ్స్, డ్రగ్స్,సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా ATM కార్డ్ వివరాలు, OTP వివరాలు ఇతరులకు తెలపవద్దు, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.

 ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వండి. విద్యార్థినిలు అందరూ క్రమశిక్షణ కలిగి, తల్లిదండ్రులను గురువులను గౌరవించి, ఉన్నత విద్యను అభ్యసించి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని తెలిపినారు. ఆకతాయిలు ఎవరైనా అల్లరి పెట్టినట్లయితే వేధించినట్లయితే షీ టీం కి సమాచారం ఇవ్వండి.మీయొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. 

 *పిల్లలు మరియు మహిళల భద్రత, గురించి భరోసా సెంటర్ గురించి వివరించారు టి సేఫ్ గురించి విద్యార్థినిలకు పూర్తి అవగాహన తెలియజేశారు టోల్ ఫ్రీ నెంబర్ 112 సమాచారం అందించగలరు.

వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.

 అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో అవగాహన కల్పించారు.

 ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ నర్సిగ్ కాలేజీ ప్రిన్సపల్ అనిత, భరోసా సెంటర్ లీగల్ సపోర్ట్ ఆఫీసర్ జ్యోతి, మరియు కోఆర్డినేటర్, కౌన్సిలర్ పవిత్ర, హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ రెడ్డి మహిళా కానిస్టేబుల్ ఉమా మహేశ్వరీ మరియు ఉపాధ్యాయునిలు కళాబృందం ఇంచార్జి యల్లన్న, సభ్యులు గోపయ్య, చారి, కృష్ణ, నాగార్జున విద్యార్థినిలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333