ఆర్యవైశ్య మహాసభ సూర్యాపేట పట్టణ అధ్యక్షునిగా అవకాశం కల్పించండి.
కలకోట లక్ష్మయ్య.
సుధాకర్ పివిసి మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కలకోట లక్ష్మయ్య.
సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం పట్టణ ఎన్నికల బరిలో "కలకోట".
సూర్యపేట, 17 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తే సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్యులందరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, పేద ఆర్యవైశ్యులను అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు, వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ 104A గో సేవ ఇంచార్జ్ కలకోట లక్ష్మయ్య అన్నారు. రానున్న ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో సూర్యాపేట పట్టణ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించాలని కోరుతూ తన మిత్రబృందంతో సోమవారం సుధాకర్ పివిసి మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కలకోట లక్ష్మయ్య మాట్లాడుతూ.. అభిమానుల కోరిక మేరకే పట్టణ సంఘం ఎన్నికల బరిలోకి వచ్చానని, సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం ఎన్నికల బరిలో అధ్యక్షునిగా ఉండేందుకు గతంలోనే మీలా మహాదేవ్ అనుమతి పొందానని, దానిని మరొకసారి గుర్తు చేయడానికి తన మద్దతుదారులతో కలసి వారిని ఈ రోజు కలవడం జరిగిందని తెలిపారు. మీలా మహాదేవ్ ఇచ్చిన మాట ప్రకారం ఆర్యవైశ్యులందరిని కలుపుకుపోయి సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మద్దతుదారులు సైతం లక్ష్మయ్య ను బలపరుస్తూ ముక్తకంఠంతో సంఘీభావం తెలిపారు. అనంతరం మీలా మహాదేవ్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని పిలువునిచ్చారు. సంఘ అధ్యక్షుడిగా కలకోట లక్ష్మయ్య ఉండేందుకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్థానని తెలిపారు. కష్టపడి పనిచేసేవారికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, అందరూ కలసికట్టుగా సంఘం అభివృద్ధికి పనిచేయాలని సూచించారు.