సూర్యాపేటలో ఆర్టీసీ డ్రైవర్లకు రహదారి భద్రత అవగాహన కార్యక్రమం
సూర్యపేట, 17 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈరోజు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు సూర్యాపేట టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ,మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లకు Arrive Alive (సురక్షితంగా చేరుకుందాం) సందేశంతో పాటు రహదారి నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించారు. ముఖ్యంగా లేన్ డ్రైవింగ్ ప్రాముఖ్యత ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ ప్రమాదాలు డ్రంకెన్ డ్రైవింగ్ వల్ల కలిగే తీవ్ర పరిణామాలు ప్రయాణికుల భద్రతపై డ్రైవర్ల బాధ్యత వంటి అంశాలపై నిపుణులు వివరంగా చర్చించారు. ప్రతి డ్రైవర్ రహదారి నియమాలను కచ్చితంగా పాటించి, సురక్షిత ప్రయాణానికి తోడ్పడాలని అధికారులు సూచించారు. ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర అత్యంత ముఖ్యమని, ప్రజల ప్రాణ భద్రత అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, పోలీస్ సిబ్బంది ,ఆర్టీసీ అధికారులు, సిబ్బంది మరియు డ్రైవర్లు పాల్గొన్నార