పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యం
పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యం
రోహిర్ సర్పంచ్ కావిరి అర్జున్
తెలంగాణ వార్త మార్చి 15 ఏటూరునాగారం :- గ్రామాలలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని రోహిర్ సర్పంచ్ కావిరి అర్జున్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏటూర్ నాగారం మండలంలోనీ రొయ్యూరు గ్రామపంచాయతీ ఆవరణలో ఆదివారం పారిశుధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కావిరి అర్జున్ మాట్లాడుతూ గ్రామాలు, పరిశుభ్రంగా ఉండేందుకు పారిశుధ్య కార్మికులు నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే నిజమైన సేవకులు పారిశుధ్య కార్మికులేనని కొనియాడారు. సమాజ ఆరోగ్యం, పరిశుభ్రత కోసం వారు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో పారిశుధ్య కార్మికుల సేవలు మరింత కీలకమని అన్నారు. సమాజం వారి సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ కావిరి అర్జున్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు . స్థానికులు.
గ్రామ సిబంది కారోబార్ గజ్జల శంకర్ ఆకుదారి రమేష్ డోంగిరి రాంబాబు మంతెన గట్టయ్య సిక్కల వరలక్ష్మి ఐయొక్క కార్యక్రమంలో వార్డు సభ్యులు కొండగొర్ల తిరుపతి గజ్జల అంకుల్ మాజీ వార్డు సభ్యులు కొండగొర్ల నరసింములు ఆశవర్కర్లు రాజాలక్ష్మి. రమాదేవి .గ్రామస్తులు సోదరి సుధాకర్. మూలకాల సాంబయ్య .మోతే బాబు. గాడవేణి రంజిత్. కొయ్యల శేఖర్ .తదితరులు పాల్గొన్నారు