మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం అందించాలి

Mar 15, 2026 - 19:23
Mar 15, 2026 - 20:04
 0  0
మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం అందించాలి

మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం అందించాలి.

ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోవాలి.

 తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్.

తెలంగాణ వార్త మార్చి 15 వాజేడు : వాజేడు మండలాల్లో మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జజ్జరి దామోదర్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని చింతూరు, గొల్లగూడెం గ్రామాలలో( హైటేక్ కంపెనీ) మొక్కజొన్న పంట వేసిన వ్యవసాయ క్షేత్రాలను రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది. మండల వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో బాండు (హైటేక్ కంపెనీ )మొక్కజొన్న వ్యవసాయం సాగు చేశారని, హైటెక్ కంపెనీకి ఎకరానికి మూడు నుంచి నాలుగు టన్నుల దిగుబడి వస్తుందని,మూడు రకాల మొక్కజొన్న విత్తనాలు రైతులకు ఇచ్చి వారికి ఆశ చూపి సాగు సేపించారని, ఆచరణలో మాత్రం ఒకటి నుండి రెండు టన్నుల మధ్యలోనే దిగుబడి వచ్చినట్లు రైతులు తెలిపారని,మొక్కజొన్న దిగుబడి తగ్గిన విషయం బయటకు రాకుండా సదరు కంపెనీలకు చెందిన ఆర్గనైజర్లు రైతులను నయానో భయానో ఆశ చూపి వారిని మభ్యపెట్టారని ఆరోపించారు. మెట్టుపల్లి గోపాల్ అనే రైతు 10 ఎకరాలు (హైటెక్ కంపెనీ )మొక్కజొన్న వ్యవసాయం సాగు చేశారని,పంట ముగింపు దశకు వచ్చిన కంకిలోకి గింజలు లేకపోవడంతో సదరు రైతు కంపెనీ ఆర్గనైజర్ దృష్టికి తీసుకు వెళ్ళగా, నీకు ఇష్టం ఉంటే పంట ఇవ్వు లేకపోతే లేదు అని తెగేసి చెప్పినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది ఎకరాల కౌలు భూమిలో మొక్కజొన్న సాగు చేసి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే దిగుబడి రాకపోవడంతో పాటు,కంపెనీ ఆర్గనైజర్లు మొఖం చాటేయడంతో రైతు తన కష్టం,పెట్టుబడులు లక్షల్లో నష్టపోయానని, ప్రభుత్వ అధికారులు తనకు న్యాయం చేయాలని, లేకపోతే చావే నాకు దిక్కు అని ఆవేదన చెందుతున్నట్లు తెలిపారు. వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులు స్పందించి మొక్కజొన్న పంట నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల మండల వ్యాప్తంగా రైతులందరిని ఐక్యం చేసి ఉదృతంగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు మెట్టుపల్లి గోపాల్ దన్నూరి రమేష్ అట్టం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్