అడ్డగూడూరులో వివిధ కార్యాలయాలలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు 

Jan 26, 2026 - 18:58
 0  72

అడ్డగూడూరు 26 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని వివిధ కార్యాలయంలోని 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం జెండాను ఆవిష్కరించారు.తొలిత స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ.ఎస్సై ఈశ్వరయ్య జాతీయ జెండాను ఎగరవేశారు.ఎంపీడీవో కార్యాలయంలో శంకరయ్య జాతీయ జెండాను ఎగరవేశారు.ఎంఈఓ కార్యాలయంలో ఎన్ సబిత జాతీయ జెండాను ఎగరవేశారు.ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్ లు,పి వెంకటాద్రి జాతీయ జెండాను ఎగరవేశారు.మహిళ సమాఖ్య కార్యాలయంలో పద్మావతి జాతీయ జెండాను ఎగరవేశారు.ప్రభుత్వ దవఖానాలో డాక్టర్" బి భార్గవి జాతీయ జెండా ఎగరవేశారు.మండల తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ శేషగిరిరావు జాతీయ జెండాను ఎగరవేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూజారి వనజ సైదులు,గ్రామ వార్డు సభ్యులు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మనగూటి జోజి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలెoల విద్యాసాగర్,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ నాథ్,బిజెపి మండల అధ్యక్షుడు ననుబోతు సైదులు,పోలీస్ సిబ్బందితో పాటు వివిధ కార్యాలయాలలో స్వీట్లు, మిఠాయిలు పంచారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333