ఘోర ప్రమాదం ఇద్దరు యువకులు మృతి

Aug 18, 2024 - 23:11
 0  2
ఘోర ప్రమాదం ఇద్దరు యువకులు మృతి

 క్రైమ్ కౌంటర్ న్యూస్ కోదాడ నియోజకవర్గం ప్రతినిధి తోళ్ల గురునాథం కోదాడ ఆగస్టు 18

 సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు క్రాస్ రోడ్డు వద్ద రెండు టూ వీలర్ బైకులు ఎదురెదురుగా  ఢీకొని సంఘటనా స్థలంలోనే ఇద్దరు యువకులు మృతి.

 స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం మార్గమధ్యంలో వస్తూ వెళుతున్నవారు  ఆదివారం రాత్రి 10:40 గంటలకు కాపుగల్లు క్రాస్ రోడ్ వద్ద ఇద్దరు యువకులు రక్తపు  మడుగులో పడి ఉన్నవారిని  చూసి వారు వెంటనే స్పందించి 108 వాహనానికి, మరియు కోదాడ రూరల్ పోలీస్ వారికి కూడా సమాచారం అందజేసినారు.  వెంటనే కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ వారు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనా స్థలంలో రక్తపు మడుగులో పడి  ఉన్న యువకులను 108 వాహనం ద్వారా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి  స్పందించి ఆస్పత్రిలో చేరిన వారిని చూసి యువకులు అప్పటికే చనిపోయారని  నిర్ధారించినారు. అప్పుడు రూరల్ పోలీస్ స్టేషన్ వారు చనిపోయిన ఇరువురి సమాచారం సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసినారు. చనిపోయిన వారి యొక్క వివరములు 1) కలకొండ సుదర్శన్ తండ్రి  శ్రీను వయసు 24 సంవత్సరంలు వృత్తి తాపీ మేస్త్రి,  అను అతను రోజువారి వృత్తిరీత్యా కోదాడ నుండి సుమారు 10:40 గంటలకు తనకున్న టూ వీలర్ ద్వారా  కాపుగల్లు క్రాస్ రోడ్డు వద్దకి కోరుకుంటూ  తాను ముందుగా వెళుతున్న లారీని క్రాస్ చేస్తూ ముందుకు వెళుతుండగా, ఇంతలోనే సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం మేళ్ల చెరువు గ్రామానికి చెందిన మంగళపల్లి విజయ్ తండ్రి శ్రీను వయస్సు 22 సంవత్సరములు వృత్తి వ్యవసాయ కూలీ, తాను స్వగ్రామైన మేళ్లచెరువుకి చెందిన స్నేహితుడు హైదరాబాదు నుండి కోదాడ బస్టాండ్ లోకి వచ్చి తనకు ఫోన్ చేయగా వెంటనే తన స్పందించి మేళ్లచెరువు నుండి  ఆదివారం రాత్రి 10 -45 గంటలకు తన  స్నేహితుడి కోసం తన యొక్క టూ వీలర్ వెహికల్ ద్వారా అతివేగంగా తన స్వగ్రామమైన  మేళ్లచెరువు నుండి   కోదాడ బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో   సుమారు 10:45 గంటలకు కాపుగల్లు  క్రాస్ రోడ్ దగ్గరకు అతివేగంగా వస్తూ తనకు ఎదురుగా వస్తున్న విజయ్ కి చెందిన టూవీలర్ ని అతివేగంగా ఢీకొనడమైనది . ఆ సంఘటనలో ఇరువురు అక్కడికక్కడే రక్తపు మడుగులో స్పృహ లేకుండా  పడిపోయి ఉన్నారని, స్థానికులు తెలిపారు.   అప్పుడు చనిపోయిన ఇరువురి కుటుంబ సభ్యులు వచ్చి చనిపోయిన వారిని ఆదివారం రాత్రి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి లో శవ పంచినామా  నిమిత్తం మార్చురీలో  (పోస్టుమార్టం) ఉంచి సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి  డాక్టర్ వచ్చి చనిపోయిన వారిని శవ పంచినామా చేసి కుటుంబ సభ్యుల మరియు కోదాడ రూరల్ పోలీసు వారి సమక్షంలో  చేసి వారిరువురి  పార్థివదేహాలను కోదాడ రూరల్ పోలీసు వారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పినారు. కోదాడ రూరల్ పోలీసు వారు  కేసు దర్యాప్తు  చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333