శాలివాహన (కమ్మర) సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

మునగాల 09 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మునగాల మండలం ముకుందాపురం గ్రామంలోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో బేతవోలు గ్రామానికి చెందిన శాలివాహన (కుమ్మర) సంఘ సామూహిక కార్తీక వనభోజన కార్యక్రమంలో భాగంగా అనాధలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధ్యక్షులు కడారు నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కలపగిరి వెంకటేష్, కార్యదర్శి బాడిశ శ్రీను, కోశాధికారి బొడ్డుపల్లి పరిశరాములు పాల్గొన్నారు