త్రాగునీరు అందించండి మహాప్రభువు.
జోగులాంబ గద్వాల 26 ఫిబ్రవరి 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- పట్టణం తొమ్మిదవ వార్డ్ రాఘవేంద్ర కాలనీలో గత కొన్ని రోజులుగా త్రాగు నీరు సరిగా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు, ఖాళీ బిందాలతో నిరసన తెలిపారు.తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని 9వ వార్డు కాలనీ మహిళలుడిమాండ్ చేశారు.