స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి.
ఎర్రవల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న
ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్. ఏ సంపత్ కుమార్
జోగులాంబ గద్వాల 3అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:-
త్వరలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఆయా గ్రామాల అభివృద్ధి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని ఎర్రవల్లి మండల ముఖ్య నాయకులు,కార్యకర్తలకు సూచించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో
సంక్షేమ పథకాల అమలుతో గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి చేయడం జరుగుతుందని అన్నారు.
నాయకులు, కార్యకర్తలు
సమన్యంగా గ్రామాల్లోని ప్రజలకు విస్తృతంగా అభివృద్ధి పథకాల విషయంపై ప్రచారం చేసి వివరించి అభ్యర్థులను గెలిపించడమే ముఖ్య ఉద్దేశంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని, ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో దిశా నిర్దేశం ఎఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సూచించారు...
ఈ సమావేశంలో ఎర్రవల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.