బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

Nov 29, 2025 - 20:01
 0  7
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

–మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి
మరిపెడ 29 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మాజీ ఒడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి అన్నారు.మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని మూడో వార్డుకు చెందిన గ్రామీణ వైద్యుడు గంగుల శ్రీహరి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్ బాధితున్ని పరామర్శించారు. 
బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు.వైద్యుల సలహాలు పాటిస్తూ ఆరోగ్యం కుదుటపడే వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.గ్రామీణ వైద్యుడు శ్రీహరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో కృషి చేశారని,అలసట లేకుండా తిరిగి అనారోగ్యం పాలయ్యాడన్నారు. ప్రభుత్వం గ్రామీణ వైద్యులను ఆదుకోవాలని కోరారు.ఈ పరామర్శలో మరిపెడ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రేఖ,స్థానికులు లలిత,వెంకటేశ్వర్లు , మాచర్ల భద్రయ్య,కొచ్చర్ల కరీం,జినక శ్రీరాములు, గంగుల శ్రీహరి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333