యాదాద్రి నల్లగొండ జిల్లాలను అనుసంధానం చేస్తూ నకిరేకల్ టూ మోత్కూరు బస్సులు నడపాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఉప్పుల శాంత కుమార్

అడ్డగూడూరు 04 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గార్లకు వినతి పత్రం అందజేత గత ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించిన మానాయకుంట గురజాల మూసి నది వంతెన పై ఎలాంటి రవాణా సౌకర్యాలు లేక అడ్డగూడూరు శాలిగౌరారం మండల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి ఎమ్మెల్యే మందుల సామేల్ గార్లకు విన్నవించారు.అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ..నకరేకల్ టు మోత్కూర్ వయా అడ్డగూడూరు బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.బస్సు సర్వీస్ ఏర్పాటు చేస్తే మహాలక్ష్మి పథకంతో ఈ ప్రాంత ప్రజలకు కొంత ఉపయోగం జరుగుతుందన్నారు.
అదేవిధంగా ఇక్కడ ప్రాంత విద్యార్థులు పై చదువుల కొరకు నల్గొండ సూర్యాపేట తదితర పట్టణాలకు వెళ్తారని అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ శనివారం కళాశాలకు వెళ్లి రావడానికి ప్రయాణ సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం గడిచిన కూడా ఇక్కడ ప్రజలకు మహాలక్ష్మి ఉచిత పథకం మాత్రం లబ్ధి పొందడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారని వారు అభిప్రాయపడ్డారు.వినతి పత్రం స్వీకరించిన ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా మాట్లాడుతూ ఆర్టీసీ ఎండి సజ్జనార్ తో మాట్లాడి వెంటనే బస్సు ఏర్పాటుకు సహకరిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు శివ, చరణ్ మానాయికుంట గురుజాల గ్రామస్తులు చిప్పలపల్లి బన్నీ గూని వెంకటయ్య , అంజయ్య తదితరులు పాల్గొన్నారు.