బహు కమనీయం భక్తి పారావస్యంగా దివ్య క్షేత్రం భద్రాద్రి వైకుంఠ ద్వార దర్శనం
భక్తి వరవస్యంతో దర్శించుకున్న భక్తజనం.
తెలంగాణ వార్త డిసెంబర్ 30 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : వైకుంఠ ఏకాదశి దశావతార మహోత్సవాల సందర్భంగా 30వ తేదీ జయవారం దివ్య క్షేత్రం భద్రాచలంలో అశేష సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ద్వారం నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించు నిమిత్తం రాత్రి 12 గంటల నుండి భక్తులు మిథిలా నగర్ స్టేడియంలో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశంలో వేచి ఉన్నారు. అధికంగా చలి ఉన్నప్పటికీ ఉత్తర ద్వారం నుండి స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు వేచి ఉన్నారు. జయ వారం ఉదయం సుమారు ఐదు 5.00 గంటలకు భాజా భజంత్రీలు, వేద మంత్రాల మధ్య వైకుంఠ ద్వారం తెలుసుకోవడంతో పరమానంద భరితులైన భక్తులు జైశ్రీరామ్ జై జై సీతారాం శ్రీ సీతారామచంద్ర మహారాజ్ కి జయహో జయ జయహో అంటూ పెద్ద పెట్టున భక్తులు నివదించారు. ముందుగాపవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అక్కడినుండి వైకుంఠ ద్వారం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్న అనంతరం. దేవాలయంలో మూల విరాటును దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఎండ్