రాయి రవి మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు
మునగాల 18 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామ సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ రాయి సైదులు (76) మరణం సిపిఎం పార్టీకి వారి కుటుంబానికి తీరనిలోటని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య అన్నారు. గురువారం సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రాయి సైదులు మృతదేహంపై ఎర్రజెండాను కప్పి వారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య మాట్లాడుతూ సైదులు చిన్నతనము నుండి ఎర్రజెండా నాయకత్వన జరిగిన ప్రజా పోరాటాలో చురుకైన కార్యకర్తగా ప్రజాలను కదిలించడంలో రైతు కూలీలను మమేకం చేస్తూ పోరాట ఉద్యమాలలో నీతిగా నిజాయితీగా ఉంటూ నాయకత్వాని అండదండలనిస్తూ వారిని కాపాడుకోవడంలో ఘనమైన పాత్ర పోషించాడు అని వారి మరణం సిపిఎం పార్టీకి తీరనిలోటు అని అన్నారు. రాయి సైదులుకు ఇద్దరు కుమారులు ఇద్దరు కూతుర్లు, ఉన్నారు, సైదులుకు విప్లవ జోహార్లు అర్పిస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, దేశి రెడ్డి స్టాలిన్ రెడ్డి,మామిడి గోపయ్య, సిపిఎం పార్టీ గ్రామ శాఖ కన్వీనర్ బట్టి పల్లి ఉపేందర్, శాఖ కార్యదర్శులు బచ్చలకూర సుధాకర్, జలగం జీడయ్య, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు బచ్చల కూర సికిందర్, బి గోవర్ధన్, కె రాములు,ఆర్ వెంకటరత్నం,బి గురవయ్య, ఆర్ రాజశేఖర్,ఆర్ నాగేశ్వరరావు,ఆర్ శ్రీను, వి నరసయ్య, కె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.